రోబో డాగ్‌... ఓ కంట కనిపెడుతూనే ఉంది..!

రోబో డాగ్‌... ఓ కంట కనిపెడుతూనే ఉంది..!

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకోవాలంటే సామాజిక దూరం పాటించాలి. ప్రపంచదేశాధినేతలు ఈ మాట చెబుతున్నప్పటికీ.. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికి పట్టించుకోని వారున్నారు.  ఆ కొందరి కోసం 'బోస్టన్‌ డైనమిక్స్‌' సంస్థ ఓ రోబోటిక్‌ డాగ్‌ను సృష్టించింది. ఈ రోబో ప్రస్తుతం సింగపూర్‌లోని 'బిషన్‌ ఆంగ్‌మో కియో' పార్క్‌లో ప్రయోగాత్మకంగా తన విధులను నిర్వర్తిస్తోంది. పార్కులో తిరిగే ప్ర‌జ‌ల‌ను సామాజిక దూరం పాటించ‌మంటూ బాధ్య‌త‌గా గుర్తు చేస్తుంది. పార్కులో ఉండే ప్ర‌జ‌ల‌ను ఓ కంట క‌నిపెడుతూ ఉంటుంది. ఎవ‌రైనా ద‌గ్గ‌ర‌గా ఉన్నారంటే.. వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లి.. "ప్లీజ్ ప్లీజ్ దూరం జరగరా... ఇంకాస్త... ఇంకాస్త" అంటూ పొలైట్‌గా చెప్పింది. తల బాగాన అమర్చిన కెమెరాల ద్వారా మనుషులు గుమికూడిన చోటును ఆ రోబో గుర్తిస్తుంది. దూరం పాటించాలంటూ ముందుగా రికార్డు చేసిన వాయిస్‌ను వినిపిస్తోంది.