శంకర్ కు గ్రాఫిక్ కష్టాలు..

శంకర్ కు గ్రాఫిక్ కష్టాలు..
సామాజిక అంశాలతో కూడిన కథకు కమర్షియల్ అంశాలను జతచేసి భారీ స్తాయిలో సినిమా తీస్తే అది ఖచ్చితంగా శంకర్ సినిమానే అవుతుంది.  శంకర్ సినిమా అనగానే ప్రేక్షకులు భారీ స్థాయిలో ఊహించుకుంటారు.  శంకర్ గత చిత్రాలతో పోలిస్తే ఇటీవల వచ్చిన ఐ సినిమా కాస్త నిరాశ పరిచింది.  ఐ పరాజయం నుంచి బయటపడేందుకు శంకర్ రోబో కు సీక్వెల్ గా రోబో 2.0 చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.  కానీ, గ్రాఫిక్ పార్ట్ మాత్రం ఇప్పటి వరకు ఓ కొలిక్కిరాలేదు.  
గ్రాఫిక్ వర్క్స్ ను అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ దివాళా తీయడంతో లైకా ప్రొడక్షన్ సంస్థ అమెరికాలోని మరో సంస్థకు అలాగే జపాన్ లోని ఓ గ్రాఫిక్స్ వర్క్స్ కంపెనీకి దీనిని అప్పగించింది.  అమెరికాకు చెందిన ఆ సంస్థకూడా దివాళా తీయడంతో.. లైకా ప్రొడక్షన్స్ డీలా పడింది.  మరోవైపు 2.0 ట్రైలర్ లీక్ కావడంతో దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.  లీకైన ట్రైలర్ స్థానంలో మరికొన్ని సీన్స్ ను కట్ చేసి కొత్త ట్రైలర్ ను రూపొందించారు.  ఐపీఎల్ ఫైనల్స్ రోజున రోబో 2.0 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.