రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

కొమరం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కైరిగూడ ఆర్చ్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళ్తోన్న బొలేరో వాహనం.. రెబ్బన మండలం సోనాపూర్ వద్ద అదుపుతప్పి వంతెన పై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలేరోలో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.