రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ సమీపంలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో జరిగింది. వివరాల ప్రకారం... వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా  గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. మృతిచెందిన యువకులు సురారం సాయిబాబా నగర్‌కి చెందిన వారుగా అక్కడి స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Photo: FileShot