సాయి ధరమ్ తేజ్ కు జోడి ఎవరంటే..

సాయి ధరమ్ తేజ్ కు జోడి ఎవరంటే..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ సాయి ధరమ్  తేజ్ కు బాగా నచ్చడంతో ఒకే చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది ఈ ప్రాజెక్టు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన రితికా సింగ్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. 

గతంలో ఈమె వెంకటేష్ సరసన గురు చిత్రంలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ధరమ్ తేజ్, రితికా కాంబో ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఫ్రెష్ గా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ సుప్రీం హీరో తాజాగా నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన నేపథ్యంలో మంచి పాజిటివ్ హైప్ నెలకొంది.