బెంగళూరు లక్ష్యం 182

బెంగళూరు లక్ష్యం 182

ఐపీఎల్-11లో భాగంగా ఫెరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన ఢిల్లీకి.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ లోనే ఓపెనర్ పృథ్వీషా(2) అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్(12) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఈ సమయంలో కష్టాల్లో పడ్డ ఢిల్లీని పంత్, అయ్యర్‌ల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆచితూచి ఆడటంతో.. స్కోర్‌బోర్డు పరుగులు పెట్టింది. ధాటిగా ఆడిన రిషబ్ పంత్(61; 34 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సులు) అర్థ శతకం చేశాడు. కొద్ధి వ్యవధిలో పంత్, అయ్యర్(32)లు పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన అభిషేక్ శర్మ(46), విజయ్ శంకర్‌(21)లు రెచ్చిపోయారు. వీరిద్దరూ 61 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఢిల్లీ 181 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు లక్ష్యం 182 పరుగులు. బెంగుళూరు బౌలర్ చాహల్ రెండు వికెట్లు తీశాడు.