రిచర్డ్ హ్యాడ్లికి క్యాన్సర్ ఆపరేషన్

రిచర్డ్ హ్యాడ్లికి క్యాన్సర్ ఆపరేషన్

న్యూజిల్యాండ్ ప్రముఖ క్రికెటర్ రిచర్డ్ హ్యాడ్లీకి డాక్టర్లు క్యాన్సర్ ఆపరేషన్ నిర్వహించారు. ఆయనకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని  డాక్టర్లు సూచించారు. గత నెల రిచర్డ్ జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఆ చెకప్ లో హ్యాడ్లీ  పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు. డాక్టర్లు క్యాన్సర్ ట్యూమర్ ని ఆపరేషన్ చేసి తీసివేశారు. త్వరలో ఆయనకు కీమో థెరఫి కూడా చేయనున్నారు డాక్టర్లు. 66ఏళ్ల రిచర్డ్ ఫాస్ట్ బౌలింగ్ క్రికెటర్. టెస్ట్ లు 400 వికెట్లు తీసుకున్న మొదటి క్రికెటర్ గా రిచర్డ్ రికార్డ్ సాధించారు. తన 39వ ఏట 1990లో రిటైర్డ్ అయ్యారు. 86 టెస్ట్ లు ఆడి 431 వికెట్లు తీశారు. 1985లో ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ లో ఆడిన మ్యాచ్ అతను కెరియర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.