దేశ అధ్య‌క్షుడిపై ప‌క్షుల దాడి..! చేతికి గాయం..

దేశ అధ్య‌క్షుడిపై ప‌క్షుల దాడి..! చేతికి గాయం..

అవును ఓ దేశ అధ్యక్షుడిపై ప‌క్షులు దాడి చేశాయి.. చివ‌ర‌కు ఆయ‌న చేతికి గాయం కూడా అయ్యింది.. ఇంత‌కీ ఎవ్వ‌రా అధ్య‌క్షుడు..? ఏమిటా ప‌క్షుల క‌థ అనేగా మీ అనుమానం.. ఆయ‌నే.. బ్రెజిల్ అధ్య‌క్షుడు జైరో బోల్సోనారో.. అస‌లే క‌రోనావైర‌స్ బారిన‌ప‌డిన ఆయ‌న‌.. ఆస్ప‌త్రిలో చేర‌కుండా.. అధికార నివాసంలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నారు.. ఇక‌, అధికార భ‌వ‌నాన్నే క్వారెంటైన్ సెంట‌ర్‌‌గా మార్చుకున్న ఆయ‌న‌కు ఒక్క‌సారిగా నివాసానికే ప‌రిమితం కావ‌డంతో.. అక్క‌డే ఉన్న రియా ప‌క్షుల‌తో కాల‌క్షేపం చేయాల‌ని అనుకున్నార‌ట‌.. ఆ వెంట‌నే.. వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఆహారం అందించారు.. మాస్క్ క‌ట్టుకుని.. కొన్ని గింజ‌న‌లు రియా ప‌క్షుల‌కు అందిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా అవిపైకి వ‌చ్చేశాయి.. గింజ‌ల కోసం పోటీప‌డ్డాయి.. అధ్య‌క్షుడి చేతిని కూడా గ‌ట్టిగా ప‌ట్టుకున్నాయి.. దీంతో. ఆయ‌న చేతికి స్ప‌ల్ప‌గాయం అయ్యింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. కాగా... ప్ర‌పంచ క‌రోనావైర‌స్ లిస్ట్‌లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.. అప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో ఆ దేశంలో 65 వేల మందికి పైగా మ‌ర‌ణించారు.