ఆర్జీవీ 'వైరస్' 

ఆర్జీవీ 'వైరస్' 

రామ్ గోపాల్ వర్మ తాజాగానే నాగార్జునతో ఆఫీసర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా..వర్మ ఎంచుకున్న కథ బాగానే ఉన్నా పాత్రల్లో సరైన నటులు లేకపోవడంతో ఆడియన్స్ పై అంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది. తాజాగానే వర్మ  వైరస్ అనే సినిమాను తీయనున్నట్లు ప్రకటించాడు. గతంలో తీసిన సర్కార్, 26/11 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన పరాగ్ సంఘ్వి ఈ కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నారు. 

దీనిపై నిర్మాత పరాగ్ సంఘ్వి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మతో వైరస్ సినిమా చేయబోతున్నాం. ఇది ముంబై మహా నగరానికి అల్లుకుని ఉండే కథ. ఎబోలా లాంటి వైరస్ ఈ నగరంలో వస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ నుండి మొదలవుతుంది. గడిచిన 40 ఏళ్లలో దాదాపు పది రకాల వైరస్ లు మానవ జీవితాన్ని అతలాకుతలం చేశాయి.  వర్మ ఈ స్టోరీని చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్తామని తెలిపారు. 

రామ్ గోపాల్ వర్మ దీనిపై మాట్లాడుతూ ఆఫ్రికా నుండి ఓ విద్యార్ధి ముంబైకి నగరానికి వస్తాడు. ఆ బాడీలో ఆల్రెడీ వైరస్ ఉండడంతో కొద్దీ రోజుల వ్యవధిలోనే అక్కడి అందరి ప్రజలకు వ్యాప్తి చెందుతుంది. దీని నుంచి దూరంగా ఉండాలంటే ఒకరి కొకరు 20 ఫీట్ దూరంలో ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. 2 కోట్ల జనాభాలో ఇది అసలు జరిగేపని కాదు. దీని వల్ల దాదాపు లక్ష మంది బలవుతున్నారు. ఇక ముంబై నగరానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ నగరం నుండి ఎవరిని బయటికి రానీయకుండా..ఒకవేళ రావడానికి ప్రయత్నిస్తే కాల్చి పారేయాలని ప్రభుత్వం ఆర్డర్స్ వేస్తుంది. ఇలా భయంతో ఉన్న ప్రజలకు, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మధ్య జరిగే డ్రామానే ఈ వైరస్ అని వర్మ తెలిపారు.