పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇలా..

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇలా..

తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.  రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.  2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు తాజా ఓటరు గణన ప్రాతిపదికన సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ధారించనున్నారు. అన్ని విభాగాల్లోనూ మహిళలకు సగం సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రాతిపదికన ఎస్‌సీలకు 19 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని అంచనా. ఈ ప్రకారం 1922 పంచాయతీల వరకు వారికి దక్కనున్నాయి. 34 శాతం కోటాలో బీసీలకు 3439 సర్పంచ్‌ పదవులు దక్కే అవకాశం ఉంది. 
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు.. జనాభా  2,02,94,874 మంది. 
ఏజెన్సీ గ్రామాలు 1,308.. ఎస్టీల జనాభా 18,68,968 మంది. 
100 శాతం ఎస్టీలున్న గ్రామాలు - 1,326.. ఇక్కడ ఎస్టీలే సర్పంచ్‌లు (మొత్తం 2,634) కానున్నారు.