మహానటిలో ఆమె లేదు

మహానటిలో ఆమె లేదు

మహానటి.. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. నటనకే కొత్త భాష్యం చెప్పిన నటీమణీ జీవితంలో తమకు తెలియని విషయాలను ఏం చూపెట్టబోతున్నారా అని సావిత్రితో పరిచయం ఉన్నవాళ్లు.. ఆమె వీరాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ల పరిచయం అయిపోయింది. అయితే కొన్ని పాత్రలను బయటకు చెప్పలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. వాటిలో సావిత్రి-జెమినీ గణేశ్‌లకు బాగా కావాల్సిన వారి పాత్రలు ఉన్నాయని. జెమినీ గణేశ్ మొదటి భార్య కుమార్తె, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ రేఖ పాత్ర కూడా ఇలాగే గోప్యంగా ఉంచారని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. రేఖ గారి పాత్రకు మహానటిలో స్థానం కల్పించలేదని దర్శకుడు నాగఅశ్విన్ తెలిపారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. సావిత్రిగారి జీవితం మొత్తాన్ని చూపాలని ఉన్నా టైమ్ లిమిట్ కారణంగా వెనక్కు తగ్గకతప్పలేదని చెప్పారు. ఆమె జీవితంలోని ప్రముఖ పాత్రలన్నింటిని పెట్టాలనిపించింది.. అలా చాలా వాటిని రాశాను.. ఫైనల్ స్క్రిప్ట్ చూశాకా.. ఎడిటింగ్ లెవల్లో కష్టమవుతుందని భావించి కొన్ని క్యారెక్టర్స్‌ను ఎడిట్ చేశానని చెప్పారు.