తగ్గిన బంగారం ధర…!

తగ్గిన బంగారం ధర…!

బంగారం ధర ఈ రోజు బాగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గి, రూ.31,450గా నమోదైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర తగ్గినట్లు సమాచారం అందుతుంది.

అలాగే… వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర ఈ రోజు రూ. 400 తగ్గి, రూ. 39,500గా నమోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పడిపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకా గ్లోబల్ మార్కెట్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. న్యూయార్క్‌లో పసిడి ధర 0.70శాతం తగ్గి, ఔన్సు ధర 1,324.90డాలర్లుగా నమోదైంది.