బిగ్ షాక్: కిమ్ చనిపోయినట్టు నటించడం వెనుక ఇదే అసలు కారణం... వాళ్లంతా ఇక జాగ్రత్తగా ఉండాలి...!!

బిగ్ షాక్: కిమ్ చనిపోయినట్టు నటించడం వెనుక ఇదే అసలు కారణం... వాళ్లంతా ఇక జాగ్రత్తగా ఉండాలి...!!

కిమ్  జోంగ్ ఉన్ ఏప్రిల్ 11 వ తేదీ నుంచి మే 1 వ తేదీవరకు ఎవరి కనిపించలేదు.  కిమ్ ఆరోగ్యం బాగాలేదని, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని, దీంతో అయన సోదరి కిమ్ యో జోంగ్ అధికారం చేపట్టబోతుందని వార్తలు వెలువడ్డాయి.  కిమ్ మరణించినట్టుగా కూడా ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఆయనకు సంబంధించిన అత్యంత సన్నిహితులకు తప్పించి కిమ్ గురించిన వివరాలు బయటకు రానివ్వలేదు.  

ఇలా కిమ్ చనిపోయినట్టుగా నటించడానికి, ఆ విధంగా వార్తలు సృష్టించడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.  ఒకవేళ కిమ్ మరణిస్తే, దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి, దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలని చూస్తారు, దానికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి, ఎవరు కుట్రలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ విధంగా నాటకం ఆడారట కిమ్.  20 రోజుల్లో ఎవరెవరు ఎలాంటి కుట్రలు చేశారు అనే విషయాలను కిమ్ తెలుసుకున్నట్టుగా సమాచారం.  ఎవరైతే కుట్రలు పన్నారో వారి పని పట్టేందుకు కిమ్ సిద్ధం అవుతున్నదని తెలుస్తోంది.