రెపో రేటు పెంచిన ఆర్ బీఐ

రెపో రేటు పెంచిన ఆర్ బీఐ

భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) రెపో రేట్లను పెంచింది. దాదాపు నాలుగేళ్ళ తరవాత వడ్డీ రేట్లు పెరిగేందుకు ఆర్‌బీఐ తెరలేపింది. రిజర్వు బ్యాంక్‌ పరపతి విధాన కమిటీ రేపో రేటు పావు శాతం పెంచాలని నిర్ణయిచింది. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ రెండు రోజుల సుదీర్ఘ చర్చల తరవాత రెపో రేట్లను పెంచాల్సిందేనని తీర్మానించింది. వరుసగా  పెట్రో, డీజిల్‌ ధరల  పెరుగుదలతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, రూపాయి విలువను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు ఆరు శాతం నుంచి 6.25 శాతానికి చేరింది.  బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్ప కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీనే రెపో రేటు అంటారు. తాము తీసుకునే రుణాలపై ఆర్‌బీఐ వడ్డీ రేటు పెంచడంతో బ్యాంకులు  తమ ఖాతాదారులపై ఈ  భారం వేస్తాయి.