దాదాగిరి ఐపీఎల్ పై చూపించు... ఆసియా కప్ పై కాదు..  

దాదాగిరి ఐపీఎల్ పై చూపించు... ఆసియా కప్ పై కాదు..  

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడి పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేసాడు. ఈ ఏడాది  జరగాల్సిన ఆసియా కప్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హోస్టింగ్ హక్కులను కలిగి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) గురువారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ఎసిసి కంటే ఒకరోజు ముందే మన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఎసిసి కంటే ముందే దాదా ప్రకటించడంతో రషీద్ తన దాదాగిరి ఏమైనా ఉంటె ఐపీఎల్ పై చూపించాలని అంతేకాని  ఆసియా కప్ పై కాదని అన్నారు.  రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఆసియా కప్ పై నిర్ణయం తీసుకునే అధికారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు మాత్రమే ఉందని తెలిపాడు. కానీ గంగూలీ తన శక్తిని చూపించడానికే ఇలా ఎసిసి కంటే ముందు ఈ విషయాన్ని చెప్పడాన్ని అన్నారు. ఆయన ఇలా చేసిన ఆసియా క్రికెట్ దేశాలను అవమానించాడని గంగూలీ కేవలం భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ పై తన దృష్టి పెడితే మంచిదని అన్నారు. ఈ ఏడాది ఆసియా కప్ హోస్టింగ్ హక్కులు కలిగి ఉన్న పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఆసియా కప్ వాయిదా పై స్పందించలేదు.