రషీద్‌.. అచ్చం ధోనీలా..

రషీద్‌.. అచ్చం ధోనీలా..

హెలికాప్టర్‌ షాట్లకు పెట్టింది పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. ఎంతో మంది ధోనీని అనుకరించి ఆ షాట్‌ కోట్టడానికి ప్రయత్నించి బోల్తా పడ్డారు. కానీ..సన్‌రైజర్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ మాత్రం హెలికాప్టర్‌ షాట్‌ను అవలీలగా కొట్టిపారేశాడు. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో రషీద్‌ ఖాన్‌ కొట్టిన ఈ షాట్‌ గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ప్రసీద్‌ కృష్ణ వేసిన ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీని రషీద్‌..  ఆఫ్‌ స్టంప్‌ వైపునకు జరిగి హిట్‌ చేయడంతో అది సిక్సర్‌గా వెళ్లింది. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ ఎలా ఆడతాడో అచ్చు అలాగే ఈ సిక్స్‌ బాది చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.