బ్రేకింగ్ :ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

బ్రేకింగ్ :ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నప్పటికీ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులు కరోనా తో ఆస్పత్రిలో చేరారు. కాగా ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపురెడ్డి ప్రకాష్ రెడ్డి కరోనా భారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే తో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ రావటంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న 16మందికి టెస్టులు చేయగా వారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఏపీలో కరోనా భారిన పడిన ఇద్దరు ఎమ్మెల్యే లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.