యూఎస్ అధ్యక్ష రేసులో కొత్తమలుపు..రంగంలోకి ప్రముఖ ర్యాపర్.!

 యూఎస్ అధ్యక్ష రేసులో కొత్తమలుపు..రంగంలోకి ప్రముఖ ర్యాపర్.!

యుఎస్ అద్యక్ష రేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున పోటీచేస్తున్నానని ప్రముఖ ర్యాపర్ కెన్యా వెస్ట్ రంగంలోకి దిగారు. కెన్యా వెస్ట్ కు టెస్లా అధినేత ఎలాన్ ముస్క్ కూడా తన మద్దతు తెలుపుతున్నానని ప్రకటించాడు. దాంతో అమెరికాలో దేశవ్యాప్తంగా ఎన్నికలపై చర్చ మొదలైంది. "నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నా. దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వుంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి" అంటూ కెన్యా వెస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అయితే ఈ విషయంపై ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారన్న చర్చ మొదలైంది. కాగా గతంలో కెన్యావెస్ట్ డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికారు. అంతే కాకుండా తన భార్య కిమ్ కర్దాషియన్ తో కలిసి వైట్ హౌస్ ను కూడా సందర్శించారు. ఇక నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ప్రజల్లో మొదలైంది.