ఇల్లు కట్టినందుకు కూలీలకి దావత్ ఇస్తే రేప్ చేసి చంపేశారు !

ఇల్లు కట్టినందుకు కూలీలకి దావత్ ఇస్తే రేప్ చేసి చంపేశారు !

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి దావత్ లో ఇంటి యజమానురాలుపై అత్యాచారం చేసి చంపేశారు కామంధులు. అయితే ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసి, మహిళను కడతేర్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న మంగళవారం రాత్రి జియాగూడలో ఓ ఇంటి నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఇంటి యజమాని కూలీలకు విందు ఇచ్చారు.

అనంతరం మద్యం మత్తులో కూలీలు ఆ ఇంటి యజమానురాలిపై అత్యాచారం చేసి ఆమెను కడతేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం జియాగూడ కేశవ స్వామి నగర్‌ కు చెందిన ఆండాళ్ అనే మహిళ కొంతకాలంగా జియాగూడలోని మేకల మార్కెట్ లో మేకలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో జియాగూడ కేశవస్వామి నగర్‌ లో సొంతిల్లు నిర్మిస్తున్నారు. తాజాగా భవన నిర్మాణం పూర్తికావొస్తుడడంతో ఆమె విందును ఏర్పాటు చేశారు.

ఆ విందుకు భవన నిర్మాణ కార్మికులను కూడా ఆహ్వానించారు. ఈ దావత్ కు మేస్త్రీతో పాటు అతని స్నేహితుడు కూడా విందుకు హాజరయ్యాడు. వారికి భోజనం పెట్టిన అనంతరం ఆండాళ్ నిద్రపోవడానికి మొదటి అంతస్థుకు వెళ్ళింది. అది గమనించిన మేస్త్రి మిత్రుడు రవి ఆమె వెనక వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఊపిరాడకుండా చేసి హత్య చేసాడు. అదే సమయంలో ఆండాళ్ కుమారుడు వెళ్లగా అతడిని నెట్టివేసి రవి అక్కడ నుండి పారిపోయాడు. పోలీసులు పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నారు.