పొలిటికల్ లీడర్ పాత్రలో రానా 

పొలిటికల్ లీడర్ పాత్రలో రానా 

స్వర్గీయనందమూరి తారకరామా రావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నుండి డైరక్టర్ తేజ తప్పుకున్నాడు. దీని వల్ల రెగ్యులర్ షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటించనున్నారని తెలుస్తోంది. 

చిత్ర నిర్మాతలు రానా దగ్గుబాటిని కలిసి కథను వివరించగా..పాజిటివ్ గానే రానా స్పందించాడట. ఈ వారంలోగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ బయోపిక్ పై ఈనెల 28న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఓ శుభ వార్త చెప్పనున్నారు. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడానికి ఓ పెద్ద డైరెక్టర్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారట. డైరెక్టర్ తేజ స్థానాన్ని భర్తీ చేసే వారు కనిపించని పక్షంలో బాలకృష్ణ దర్శకత్వ పగ్గాలు పట్టె అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యా బాలన్ కనిపించనున్నారు.