రొమాంటిక్ సెట్స్ లో స్పెషల్ ట్రీట్..!!

రొమాంటిక్ సెట్స్ లో స్పెషల్ ట్రీట్..!!

పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా రొమాంటిక్.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నది. పూరి కొడుకు ఆకాష్ పూరి ఇందులో హీరో. కేతిక శర్మ హీరోయిన్.  ఈ సినిమాకు అనిల్ పోడూరి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో అలనాటి రొమాంటిక్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.  

పూరి కొడుకు ఆకాష్ ను ఈ సినిమాతో రీ లాంచ్ చేయబోతున్నారు.  ప్యూర్ లవ్ స్టోరీగా సినిమా తెరకెక్కుతోంది.  గోవాలో 30 రోజులపాటు షూటింగ్ జరుపుకుంటోంది.  అయితే, రొమాంటిక్ సెట్స్ లో రొమాంటిక్ హీరోయిన్స్ రమ్యకృష్ణ, ఛార్మిలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఈ ఫోటోను రొమాంటిక్ స్పెషల్ ఫోటోగా యూనిట్ అభివర్ణిస్తోంది.