రెడ్ ప్రీ క్లైమాక్స్ లో అభిమానులకు రామ్ సర్ ప్రైజ్... 

రెడ్ ప్రీ క్లైమాక్స్ లో అభిమానులకు రామ్ సర్ ప్రైజ్... 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో రామ్ లుక్ పై ఓ వార్త సినీ వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రామ్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడట. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అందరిని మెస్మరైజ్ చేస్తుందని సమాచారం. ఎప్పుడు లవర్  బాయ్ ల కనిపించే రామ్ ఊర మాస్ లుక్ లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడని, ఈ  డిఫరెంట్‌ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల అవుతుండటంతో సుమారు 30 కోట్లకు పైగానే 'రెడ్' కోసం ఓ ఓటీటీ సంస్థ ఆఫర్ ఇచ్చిందట. కానీ మేకర్స్ మాత్రం సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పారట.