చరణ్ సినిమా అప్పుడే రీ షూట్లా..?

చరణ్ సినిమా అప్పుడే రీ షూట్లా..?

రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో సినిమా ఇటీవలే ప్రారంభమైంది.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి రెండు షెడ్యూల్లు ఇప్పటికే పూర్తయ్యాయి.  అయితే, రెండు షెడ్యూల్స్ లోను చరణ్ పాల్గొనలేదు.  మూడో షెడ్యూల్ లో పాల్గొన్న చరణ్ పై ఓ యాక్షన్ సీన్ తో పాటు కొన్ని కాంబినేషన్ సీన్లు షూట్ చేశారు.  కానీ, చరణ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో తిరిగి రీషూట్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  

రామ్ చరణ్, ప్రశాంత్, స్నేహ, కైరా అద్వానీలపై కొన్ని సీన్స్ తీశారు.  ఈ సీన్స్ నచ్చకపోవడంతో.. తిరిగి రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే వీటిని రీషూట్ చేస్తారని సమాచారం.  ఈనెల 12 న యూనిట్ బ్యాంకాక్ వెళ్ళబోతున్నది.  15 రోజులపాటు అక్కడ షూటింగ్ జరుగుతుంది.  అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన తరువాత హైదరాబాద్ లో సీన్స్ ని రీ షూట్ చేస్తారట.   దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.