రాంచరణ్ పై స్పెషల్ సాంగ్ ..నెట్టింట వైరల్

రాంచరణ్ పై స్పెషల్ సాంగ్ ..నెట్టింట వైరల్

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 'చిరుత' మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎంతో రఫ్ గా మాస్ హీరోగా కనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్ సీన్లు అన్నీంటా మెప్పించాడు.చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా కి నిర్మాతగా మారి ఆ సినిమాని తెరకెక్కించాడు. తండ్రి ని మళ్ళీ సినిమాలో నటింపచేసి ప్రేక్షకుల ఆశని నిరవేర్చాడు."తండ్రికి తగ్గ కొడుకు "అని అనిపించుకున్నాడు . తర్వాత రంగస్థలం సినిమాలో వినికిడి సమస్య ఉన్న యువకుడి క్యారెక్టర్ లో జీవించేసాడు.ఇదిలా ఉంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ పసుపులేటి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినం సందర్భంగా ఒక స్పెషల్ సాంగ్ ను రూపొందించారు. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. "రామ్ కొణిదెల." అంటూ సాగే ఆ స్పెషల్ సాంగ్ మెగా అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.