కొత్త షెడ్యూల్ కు చరణ్ రెడీ 

కొత్త షెడ్యూల్ కు చరణ్ రెడీ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపట్నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. 

దాదాపు 15 రోజుల పాటలు జరగనున్న ఈ షెడ్యూల్లో నటీనటుల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ లో సాగుతూనే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా రామ్ చరణ్ శైలికి తగినట్లు ఉంటాయట. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.