బాలయ్యను రిక్వెస్ట్ చేసిందట!

బాలయ్యను రిక్వెస్ట్ చేసిందట!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. అలాంటిది ఓ సినిమాలో చిన్న అవకాశం వచ్చినా చాలు నటిస్తాను అని హీరోను రిక్వెస్ట్ చేస్తోందట. ఆ సంగతేంటో చూద్దాం.. దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ చేయనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 

అయితే ఈ సినిమాలో చిన్న పాత్రలో అయినా కనిపించాలని ఆశ పడుతోన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల బాలకృష్ణను కలిసినప్పుడు సినిమాలో తనకు కూడా ఛాన్స్ ఇవ్వమని అడిగినట్లు సమాచారం. చిన్న పాత్ర అయినా సరే నటిస్తానని రిక్వెస్ట్ చేసిందట. దీంతో బాలయ్య కూడా తప్పకుండా అని మాటిచ్చారట. ఎన్టీఅర్ బయోపిక్ అంటే జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్ల ప్రస్తావన ఎలాగో ఉంటుంది కాబట్టి వాటిలో ఒక పాత్ర రకుల్ కు దక్కే ఛాన్స్ ఉంది. మరి డైరెక్టర్ ఏ పాత్రకు ఆమెను సెట్ చేస్తారో చూడాలి!