ఆ ఆదాయాన్ని పీఎం సహాయనిధికి ఇచ్చేస్తా అంటున్న హీరోయిన్...

ఆ ఆదాయాన్ని పీఎం సహాయనిధికి ఇచ్చేస్తా అంటున్న హీరోయిన్...

మన దేశం లో కరోనా ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ వైరస్ ను ఓడించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరాటం లో ప్రభుత్వాలకు సహాయం చేయడానికి భారత క్రికెటర్లు, సెలబ్రెటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అయితే రకుల్ సినిమాలతో పాటుగా ఇటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గానే ఉంటుంది అలాగే తాను ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఆ ఛానల్ కి చాల మంది సబ్స్ర్కైబర్లు ఉన్నారు. అయితే అందులో ఇప్పటి వరకు తన ఫిట్ నెస్ - యోగా వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసిన రకుల్ తాజాగా వంటల ప్రోగ్రాం ప్రారంభించిందట. ఆ విషయాన్ని రకుల్ ఏ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం పీఎం సహాయనిధికి విరాళంగా ఇస్తా అంటూ తెలిపింది రకుల్. ఇక ప్రస్తుతం తెలుగులో రకుల్ కి బాగా అవకాశాలు తగ్గిన విషయం అందరికి తెలిసిందే.