దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహానేత అమర్ సింగ్ కన్నుమూత 

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహానేత అమర్ సింగ్ కన్నుమూత 

దేశ రాజకీయాలను ప్రభావితం చేసి, తనదైన శైలిలో చక్రం తిప్పిన రాజ్యసభ ఎంపీ, మాజీ సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు.  గత కొంతకాలంగా అయన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.  సింగపూర్ లో చికిత్స పొందుతూ అమర్ సింగ్ కన్నుమూశారు.  అమర్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తులు కొందరే ఉంటారు.  అలాంటి వారిలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అమర్ సింగ్ ఒకరు.   దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ యూపీఏ కు మద్దతును ఉపసంహరించుకున్న సమయంలో అమర్ సింగ్ చక్రం తిప్పారు.  సమాజ్ వాదీ పార్టీకి చెందిన 39 మంది ఎంపీల మద్దతుతో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు.  అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పక్కకు తప్పుకొని 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని స్థాపించాడు.  అయితే, ఆ పార్టీ అప్పటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.  తరువాత అమర్ సింగ్ 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయాడు.  అయితే, 2016లో అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.  2013 నుంచి అమర్ సింగ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.