రజిని సంక్రాంతికే

రజిని సంక్రాంతికే

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా కాలాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పోయిన వారమే ఈ సినిమా డార్జిలింగ్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజిని సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. 

ఈ సినిమాపై తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి కల్లా మొత్తం షూటింగ్ ను ముగించి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల్లో పాత్రలు, కథ చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో రజినీకి విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తుండడంతో క్రేజీ ప్రాజెక్టుగా అవతరించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.