సెన్సార్ పూర్తి చేసుకున్న కాలా

సెన్సార్ పూర్తి చేసుకున్న కాలా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ ఖరారు చేసినా తమిళనాట నెలకొన్న బంద్ దృష్ట్యా ఆ డేట్ కి రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఆ లోపు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో భాగంగా చిత్రాన్ని సెన్సార్ ముందుకు తీసుకెళ్లారు. సెన్సార్ వారు దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీచేసి దాదాపు 14 చోట్ల కట్ చేయాలనీ నిర్మాతలకు సూచించగా, అందుకు సుముఖంగానే స్పందించారని తెలుస్తోంది. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా వారి థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుని ఈ నెల 27న రిలీజ్ చేయాలనీ నిర్ణయించారు. కానీ తమిళ నిర్మాతలు చేపట్టిన బంద్ మూలాన మార్చి నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడనున్నాయి. దీని వల్ల రజినీకాంత్ కూడా కాలా సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత లేదు. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ఇది వరకే రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా ఉండడంతో సినిమా విడుదలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజిని ఇందులో ముంబై డాన్ గా కనిపించనున్నాడు. పా. రంజిత్ దర్శకత్వం వహించగా, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ధనుష్ నిర్మించారు.