కోహ్లీ-గంభీర్ గొడవ పై స్పందించిన అప్పటి ఆటగాడు...

కోహ్లీ-గంభీర్ గొడవ పై స్పందించిన అప్పటి ఆటగాడు...

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇద్దరు చాలా దూకుడు స్వభావం కలిగినవారే. ఆ ఇద్దరు 2013 ఐపీఎల్ లో ఓసారి వాగ్వాదానికి దిగుతారు. ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు గంభీర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు విరాట్ ఇద్దరు న్యాయకత్వపు బాధ్యతలు నిర్వహించేవారు. ఎవరు ఓటమిని సహించరు. అయితే ఆ రోజు మ్యాచ్ లో కోహ్లీ ఔట్ అయ్యి పెవిలియన్ కు వెళ్తుండగా గంభీర్ అతడిని స్లెడ్జ్ చేస్తాడు. దాంతో ఇద్దరు ఒకరి మీదకి మరొకరు వెళ్తారు. అప్పుడు ఆ ఇద్దరి మధ్యలోకి  కోల్‌కతా ఆటగాడు రజత్ భాటియా వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ గొడవ పై తాజాగా స్పందించిన భాటియా... వారు తమ జట్లకి విజయం అందించాలని చూసే నాయకులూ... కాబట్టి ఆ గొడవని మ్యాచ్‌లో భాగంగానే చూడాలి. అయితే ఆ రోజు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు మాత్రం నేను చెప్పలేను అని అన్నాడు. కానీ ఆ  తర్వాత మళ్ళీ వారు మైదానంలో అలా ప్రవర్తించడం నేను చూడలేదు’’ అని తెలిపాడు. ఇక కెప్టెన్‌గా గంభీర్ రెండు సార్లు టైటిల్స్ గెలువగా కోహ్లీ మాత్రం ఐపీఎల్ టైటిల్ ను ఇంకా అందుకోలేదు.