టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్...

ఐపీఎల్-11లో భాగంగా జైపూర్ లోని సవాయి మన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు జరిగిన పంజాబ్ తో మ్యాచ్ లో ఓడిన రాజస్థాన్ ఈ మ్యాచ్‌ గెలవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో చివరలో ఉన్న రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరడం కష్టమే. మరోవైపు పంజాబ్ ఆరు విజయాలతో టాప్ త్రీలో ఉంది. అయితే గత మ్యాచ్‌లోని జోరుని కోనసాగించి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

జట్లు:

పంజాబ్: లోకేష్ రాహుల్(కీపర్), క్రిస్ గేల్, అక్షదీప్ నాథ్, కరుణ్ నైర్, అక్సర్ పటేల్, మార్కస్ స్టోనిస్, మనోజ్ తివారి, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), అండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రహ్మన్.

రాజస్థాన్: జాస్ బట్లర్(కీపర్), అజింక్యా రహానే(కెప్టెన్), సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, సువర్ట్ బిన్నీ, మహిపాల్ లొంరోర్, కృష్టప్ప గౌతమ్, జయదేవ్ ఉనద్కట్, ఇష్ సోదీ, అనురీత్ సింగ్.