రాయల్స్‌దే విక్టరీ..

రాయల్స్‌దే విక్టరీ..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడిన రాజస్థాన్.. ఈసారి సత్తాచాటింది.  159 పరుగలు విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన పంజాబ్‌లో రాహుల్‌(95 నాటౌట్‌; 70 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఒక ఎండ్‌లో కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు.   రాజస్తాన్‌ బౌలర్లలో గౌతమ్‌ 2 వికెట్లు..  ఆర్చర్‌, సోథీ, స్టోక్స్‌, ఉనాద్కట్‌లకు తలో వికెట్‌ దక్కింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 158 పరుగులు చేసింది. బట్లర్‌ (82; 58 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌) మినహా మరెవరూ రాణించలేదు. కెప్టెన్‌ అజింక్యా రహానే(9), కృష్ణప్ప గౌతమ్‌(8), సంజూ శాంసన్‌(22), (14), స్టువర్ట్‌ బిన్నీ(11)లు నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో ఆండ్రూ టై 4, ముజిబ్‌ ఉర్‌ రెహ్మన్‌ 2, స్టోయినిస్‌ 1 వికెట్‌ తీశారు. టోర్నీలో వరుసగా మూడు ఓటముల తర్వాత మళ్లీ రాజస్థాన్ జట్టు గెలుపొందగా.. పంజాబ్‌కు ఇది మొత్తంగా నాలుగో ఓటమి.