రంజాన్‌ సెలవులు 5 రోజులా?

రంజాన్‌ సెలవులు 5 రోజులా?

రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ దీక్షిత్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 'రంజాన్‌ సందర్భంగా ఐదు రోజులపాటు ప్రభుత్వ సెలవులు' అని పేర్కొంటూ ఓ నకిలీ ప్రభుత్వ ప్రకటనను జత చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఇందులో 'ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బంగ్లాదేశ్‌' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌ అయ్యి ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అది నకిలీ ప్రకటన అని, దాని వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ప్రకటించింది దీక్షత్‌ కూడా తన పోస్ట్‌ను తొలగించారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే దీక్షత్‌ ఇటువంటి ట్వీట్లు చేస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఆయనపై ఫైర్‌ అయ్యారు.