రాజమౌళి మల్టీస్టారర్ కథ ఇదే..!?

రాజమౌళి మల్టీస్టారర్ కథ ఇదే..!?

బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  డివివి సినిమా బ్యానర్లో దాదాపు రూ.300 కోట్ల రూపాయలతో సినిమాను రూపొందిస్తున్నారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి.  ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.  అలాగే, రామ్ చరణ్ బోయపాటి సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.  మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా నిర్మాణాన్ని చూసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్, చరణ్ లు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ లు పూర్తికాగానే రాజమౌళి మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతారు.  

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ కాప్ పాత్రలో కనిపిస్తే.. ఎన్టీఆర్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తాడట.  భారీ యాక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.  ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో సినిమా నిర్మాణం ఉండబోతుందని తెలుస్తోంది.  రామ్ చరణ్ పోలీస్ గా కొన్ని సినిమాలు చేశాడు.  అలాగే ఎన్టీఆర్ బాద్షా సినిమాలో గ్యాంగ్స్టర్ గా కనువిందు చేశాడు.  ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో ఇలాంటి రోల్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  మెగా నందమూరి అభిమానులకు పంగడే పండగ.