రాజమౌళి మల్టీస్టారర్ రీమేకా?

రాజమౌళి మల్టీస్టారర్ రీమేకా?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మల్టీస్టారర్ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లు అన్నదమ్ములుగా కనిపించనున్నారని, ఒకరు పోలీస్ పాత్ర కాగా మరొకరు డాన్ తరహా క్యారెక్టర్ అని రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా కథ ఓ బాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్తలు గుప్పుమన్నాయి. 

1990లలో బాలీవుడ్ లో విడుదలైన 'కరణ్ అర్జున్' అనే సినిమా ఆధారంగా ఈ సినిమా కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ హీరోలుగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఆ సినిమా లైన్ ను బేస్ చేసుకొని విజయేంద్రప్రసాద్ కథ రెడీ చేస్తున్నాడట. స్టోరీ లైన్ ఒకలానే ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ రీమేక్ కథ టాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!