ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని చంపకండి !

ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని చంపకండి !

తెలంగాణా హోం మంత్రి మహమద్ అలీకి నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనక అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో ఈ విషయం మీద బీజేపీ ఎమ్మెల్యే హోం రాజా సింగ్ ఫైర్ అయ్యారు. ఎవరికి కరోనా వచ్చిన ప్రభుత్వ దవాఖానాల్లోనే ట్రీట్మెంట్ అని సీఎం గతంలో చెప్పారని, కానీ మీ హోం మంత్రికి మీ స్పీకర్ గారికి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద నమ్మకం లేదని ఆయన అన్నారు. అందుకే ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని ఆయన పేర్కొన్నారు.

"కేసీఆర్ గారూ మీరు ఫార్మ్ హౌస్ నుండి, ఇంటి నుండి బయటకు రండి... హాస్పిటల్స్ ను చూడండి, ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరిగితే హోటల్స్, మాల్స్ హాస్పిటల్స్ గా మారుస్తున్నారు. కానీ తెలంగాణ లో 4 కోట్ల ప్రజలకి ఒక్కటే హాస్పిటల్" అని రాజ సింగ్ అన్నారు. "ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని చంపకండి.. బయటకి రండి పరిస్థితి చూడండి, పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. డెడ్ బాడీ లను చేంజ్ చేస్తున్నారు.. 15 రోజులు అయినా బాడీలు దొరకడం లేదని అంటూ ఆయన కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.