ఆత్మ హత్యపై వివరణ ఇచ్చిన తెలుగు రైటర్ 

ఆత్మ హత్యపై వివరణ ఇచ్చిన తెలుగు రైటర్ 

నిన్ననే తెలుగు సినీ రైటర్, డైరెక్టర్ రాజసింహా అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్త తెలిసిందే. దీనిపై ఇవాళ ఉదయమే సోషల్ మీడియా మీడియా ద్వారా రాజసింహా స్పందించారు. నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. గడిచిన రాత్రి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. నాకు డయాబెటిస్ ఉంది. ఆ సమయంలో నా పక్కన ఎవరు లేకపోవడం వల్ల అలా జరిగింది. నా గురించి కంగారు పడ్డ వారందరికీ ధన్యవాదాలు. ఇంకో రెండు మూడు రోజుల్లో హైదరాబద్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని రాజసింహా తెలిపారు. ఈయన దర్శకుడిగా సందీప్ కిషన్, నిత్యామీనన్ లతో ఒక్క అమ్మాయితప్ప సినిమాను చేశారు. అలాగే రైటర్ గా రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ నటించిన గోనగన్నా రెడ్డి పాత్రకు మాటలు రాశారు.