అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రైనా

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రైనా

ఐపీఎల్‌-11లో చెన‍్నై సూపర్‌ కింగ్స్ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ప్రతీ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రైనా రికార్డు నెలకొల్పాడు. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌, చెన‍్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో రైనా  మూడొందల పరుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రైనా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో రైనా(52; 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి సోధి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ ఐపీఎల్-11 సీజన్ లో ఇప్పటి వరకు రైనా 313 పరుగులు చేసాడు.