నాలుగు రోజులు వానలే

నాలుగు రోజులు వానలే

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, విదర్భ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయని.. వీటి ప్రభావంతో రాబోయే 72 గంటల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తామని వెల్లడించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి, ఉక్కపోతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6 కల్లా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పూర్తిస్థాయిలో ప్రవేశిస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.