రైల్వే శాఖ సంచలన నిర్ణయం...జూన్‌ 30 వరకూ రైళ్లు రద్దు

రైల్వే శాఖ సంచలన నిర్ణయం...జూన్‌ 30 వరకూ రైళ్లు రద్దు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన తగ్గకపపోవడంతో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది...జూన్‌ 30 వరకూ రైల్ సర్వీసులును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..ఈ నెల 17తో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ముగియనుండడంతో రైల్వే శాఖ నిర్ణయంతో  ప్రయాణికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు...

దేశంలోని వలస కూలీలందరినీ తరలించేందుకు మాత్రం ప్రత్యేక  శ్రామిక్ రైళ్లు యధావిధిగా నడుస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది...దానికి సంబంధించిన వివరాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్  ప్రకటించనున్నారు.... రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమయ్యే రైళ్లను రైల్వే శాఖ నడపనుంది...వచ్చే వారం రోజులకు దాదాపుగా 2.34 లక్షల మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు...45.30కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే అధికారులు ప్రకటించారు...

రైల్వేశాఖ నిర్ణయంతో దేశ ప్రజల్లో అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.. లాక్‌డౌన్‌ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని  లాక్‌డౌన్‌ 4.0 ప్రకటన  కంటే ముందు రైల్వేశాఖ నిర్ణయం తీసుకోవడంతో....లాక్‌డౌన్‌ ఇంకా కొన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలలో చర్చ జరుగుతుంది...అది జూన్‌ చివరి వరకూ పొడిగించిన అశ్చర్యం లేందంటున్నారు విశ్లేషకులు..