షాపింగ్ మాల్స్‌పై తూనికల శాఖ కొరడా

షాపింగ్ మాల్స్‌పై తూనికల శాఖ కొరడా

హైదరాబాద్‌లోని పలు షాపింగ్ మాల్స్‌, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, సూపర్‌మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తుండటంతో పాటు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పేరుతో నకిలీ.. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తున్న షాపింగ్‌ మాల్స్‌పై కేసులు నమోదు చేశారు. జీవీకే వన్, ప్రసాద్ ఐమాక్స్, పీవీఆర్ హైదరాబాద్ సెంట్రల్, పీవీఆర్ ఇనార్బిట్ మాల్, పీవీఆర్ ఫోరమ్ మాల్, సినీపోలీస్ మంజీరా మాల్, సినీ పోలీస్ సీసీపీఎల్, అమీర్‌పేట్ కార్నివాల్, పీవీఆర్ ఐకాన్ హైటెక్ సిటీ, మీరాజ్ దిల్‌సుఖ్‌నగర్‌, లియోనియా కార్నివాల్ శామీర్‌పేట్, ఏషియన్ రాధికా మల్టీప్లెక్స్ ఈసీఐఎల్, ఐనాక్స్ మహేశ్వరి, పీవీఆర్‌ నెక్ట్స్ గలేరియా మాల్, ఏషియన్ జీపీఆర్ కూకట్‌పల్లి తదితర మాల్స్‌పై తూనికల శాఖ దాడులు చేసింది.

file Photo: