కేసులకు భయపడను... 

కేసులకు భయపడను... 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని భీవాండీ కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని రాహుల్ కోర్టుకు తెలిపారు. 2014లో ఆర్ఎస్ ఎస్ రాహుల్ పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.  తదుపరి విచారణ కోసం ఆగష్టు 10కి వాయిదా వేసింది. మ‌హాత్మా గాంధీ హ‌త్యకు ఆర్ఎస్ఎస్ కార‌ణ‌మంటూ చేసిన ఆరోప‌ణ‌ల‌పై రాహుల్ ప‌రువున‌ష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ఆర్ ఎస్ ఎస్ తనపై బురద చల్లేందుకు ఈ ఆరోపణలు చేస్తోందని రాహుల్ అన్నారు. 

మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా?’ అని న్యాయమూర్తి రాహుల్‌ను ప్రశ్నించారు. అందుకు ‘నేను నేరాన్ని అంగీకరించడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. తాను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు . బీజేపీ, సంఘ్‌ తనపై ఎన్ని కేసులు వేసినా భయపడను స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మీద చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకొంటే కేసును వెనక్కి తీసుకోవడానికి సిద్ధమేనని ‌గతంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. కానీ అందుకు రాహుల్ అంగీకరించలేదు. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనే ఉద్దేశమే తనకు లేదని రాహుల్ తెలిపారు. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.