రాహుల్ ప్రెస్ మీట్ @2మినిట్స్ 

రాహుల్ ప్రెస్ మీట్ @2మినిట్స్ 

మీడియా సమావేశం అంటే గంటలు గంటలు మాట్లాడుతారని అభిప్రాయముంటుంది. జర్నలిస్ట్ లు కూడా అందుకు సిద్ధమయ్యే సమావేశాలకు వెళ్తారు. అయితే... కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ముంబయిలో నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ రెండు అంటే రెండే నిమిషాల్లో ముగించి జర్నలిస్ట్ లకు షాక్ ఇచ్చారు. 

రాహుల్ ప్రెస్ మీట్ చూసి 100 మందికిపైగా హాజరైన ప్రింట్, ఎలక్ర్టానిక్ రిపోర్టలంతా అవాక్కయ్యారు. సరిగ్గా 2నిమిషాల40సెకెండ్లలోనే ముగించేశారు. ప్రెస్ మీట్ షెడ్యుల్ ఉదయం 8.30 ఉండగా 9.20 గంటలకు వచ్చారు. వచ్చి రాగానే మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్పించి ముగించేశారు.  జీవితంలోనే అతి చిన్న మీడియా సమావేశం అని జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.