రాహుల్ సెటైర్: మేక్ ఇన్ ఇండియా అంటూనే... చైనా నుంచి దిగుమతా...!!? 

రాహుల్ సెటైర్: మేక్ ఇన్ ఇండియా అంటూనే... చైనా నుంచి దిగుమతా...!!? 

ఇండియా చైనా దేశాల మధ్య ప్రస్తుతం ఆర్థికపరమైన యుద్ధం జరుగుతున్నది.  ఇండో చైనా బోర్డర్లో టెన్షన్ కొనసాగుతూనే ఉన్నది.  పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని విధంగా ఉన్నది.  గాల్వాన్ లోయలో జరిగిన దాడి తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి.  మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లోకల్ గా తయారయ్యే వస్తువులను ఎక్కువగా వినియోగించాలని ప్రధాని మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు.  అంతేకాదు, చైనాకు చెందిన 59 రకాల యాప్స్ పై నిషేధం విధించారు.  

ఈ సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై కొన్ని సెటైర్లు వేశారు.  లోకల్ నినాదం, మేక్ ఇన్ ఇండియా అంటూనే మోడీ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను  పెంచినట్టు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 12 నుంచి 13 శాతం మాత్రమే చైనా నుంచి దిగుమతులు ఉండేవని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 17 నుంచి 18 శాతం మేర చైనా నుంచి వస్తువులు దిగుమతి అవుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు.  మేక్ ఇన్ ఇండియా అంటూనే చైనా నుంచి దిగుమతులను ఎందుకు పెంచిందో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.