హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేస్తున్న పూరి...!! 

హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేస్తున్న పూరి...!! 

పూరి జగన్నాథ్ తన కెరీర్ మొదట్లో భారీ హిట్స్ ఇచ్చాడు.  పూరి సినిమా అంటే పక్కా గ్యారెంటీ అనే విధంగా ఉండేది.  కానీ, తరువాత సినిమాలు ప్లాప్ కావడం మొదలుపెట్టాయి.  టెంపర్ వంటి హిట్ ను ఎన్టీఆర్ కు అందించాడు.  ఆ తరువాత మరలా సేమ్.  ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  

ఈ మూవీ తరువాత పూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఫైటర్ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.  హిందీ వెర్షన్ కు కరణ్ జోహార్ సపోర్ట్ చేస్తున్నారు.  పాన్ ఇండియా మూవీగా తీస్తుండటంతో పూరి తన మకాం ను హైదరాబాద్ నుంచి ముంబైకి మారుస్తున్నాడట.  హిందీలో సినిమా తీసిన అనుభవం ఉన్నది కాబట్టి ఈ ఫైటర్ తరువాత హిందీలో సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు.  ఇక ఇదిలా ఉంటె, ఫైటర్ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నారట.