హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ

హ్యాపీ బర్త్ డే ఇస్మార్ట్ పూరీ

తెలుగు సినీ పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పూరీ. సినీ పరిశ్రమలో త‌న కంటూ సెప‌రేట్ ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకున్న పూరికి హీరోల మాదిరిగానే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విప‌రీతంగానే ఉంది. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తతన కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునేలా సినిమాలు తీస్తూ అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అయినా పూరీ మార్క్ బ్రాండ్ తో తన పని తాను చేసుకు పోతున్నాడు.

పూరీ ఈరోజు ఇవాళ 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబ‌ర్ 28 1966లో ఎక్కడో నర్సీపట్నంలో జ‌న్మించిన పూరీ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితం ప్రారంభించిన పూరీ 2000 సంవ‌త్సరంలో ఫ‌స్ట్ టైం మెగా ఫోన్ ప‌ట్టి మొద‌టి సినిమానే పవ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో తీయ‌డమే కాక ప‌వ‌ర్ స్టార్ కు బ‌ద్రీ రూపంలో సూపర్ హిట్ అందించాడు. కాని ఆ స‌క్సెస్‌ను బాచీ సినిమాతో కంటిన్యూ చేయ‌లేక పోయినా ఆ త‌రువాత మ‌ళ్లీ ర‌వితేజ హీరోగా ఇట్లు శ్రావ‌ణీ సుబ్రమ‌ణ్యం లాంటి ల‌వ్ స్టోరీతో ట్రాక్ లోకి వ‌చ్చాడు.

పూరీ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన సినిమా ఇడియ‌ట్ అనే చెప్పాలి ర‌వితేజ హీరోగా నిలదొక్కుకోడానికి  కూడా మాస్ ఇమేజ్ ను తెచ్చిన హీరో క్యార‌క్టరైజేష‌న్ అంటే ఇలా ఉండాలి హీరో అంటే ఇలానే ఉండాలి అంటూ పూరీ మార్క్ అంటే ఏంటో చూపించాడు. ఆ తరువాత కొన్ని ఫ్లాపులు వచ్చినా పోకిరి సినిమాతో సరికొత్త అధ్యాయాలు లిఖించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో దేశ‌ముదురు లాంటి భారీ విజ‌యం అందుకున్న ఈ డాషింగ్ డైరెక్ట‌ర్ .ఆ త‌రువాత చిరంజీవి త‌న‌యుడిని చిరుత సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాడు పూరీ.

ఆ త‌రువాత ప్ర‌భాస్‌తో బుజ్జిగాడు, ఏక్ నిరంజ‌న్ లాంటి సినిమాల‌తో పాటు ర‌వితేజ తో నేనింతే సినిమా తీసి నంది అవార్డు సైతం అందుకున్నాడు.  2012లో మహేష్ బాబు హీరోగా బిజినేస్ మేన్...తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ సినిమా హిట్ తో పాటు...వసూళ్లపరంగా మంచి బిజినెస్ చేసింది. బిజినెస్ మేన్ తర్వాత మళ్లీ హిట్టు కోసం ‘టెంపర్’ వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘హార్ట్ ఎటాక్’ వంటి వరస ప్లాపులను చవిచూసాడు.

‘టెంపర్’ తర్వాత ఈయన చేసిన ‘జ్యోతిలక్ష్మి, ‘లోఫర్’, ‘ఇజం’, ‘రోగ్’, ‘పైసావసూల్’, ‘మెహబూబా’ వరకు పూరీ తీసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా రామ్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ ఆయన్ను మళ్ళీ నిలబెట్టింది. ఇప్పటికే 34 సినిమాల‌కు ద‌ర్శక‌త్వం వ‌హించిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. అసలు రూపాయి సంపాదించడం రాని ఏ ఎదవకీ "ఐ లవ్ యూ" చెప్పే అర్హత లేదు! ప్రపంచంలో ప్రతి ఒక్కడూ స్వార్ధపరుడే.. ఇది ఎవరితోనైనా చెప్తే, ఏ నాకొడుకూ ఒప్పుకోడు!...లాంటి డైలాగ్స్ చెప్పడం ఆయనకే సాధ్యం ఏమో !