ఇస్మార్ట్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న పూరి రొమాంటిక్ 

ఇస్మార్ట్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న పూరి రొమాంటిక్ 

టెంపర్ తరువాత పూరి జగన్నాథ్ కు సరైన హిట్ లేదు.  మంచి హిట్ కోసం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వరకు ఆగాల్సి వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో పూరి వెంటనే తన కొడుకును తిరిగి హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  రొమాంటిక్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.  ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ షాక్ ఇచ్చేలా ఉండటం విశేషం.  

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నది.  గోవాలో రొమాంటిక్ సినిమా సాంగ్స్ ను ప్లాన్ చేశారు.  అక్కడ సాంగ్స్ షూట్ చేస్తే.. ఆ క్లైమేట్ కు సాంగ్స్ అద్భుతంగా ఉంటాయన్నది పూరి ఉద్దేశ్యం.  ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ కు గోవా క్లైమేట్ ప్లస్ అయ్యింది.  అంతేకాదు, ఇస్మార్ట్ శంకర్ సమయంలో పూరి అండ్ కో యూనిట్ కు గోవాలో ఓ తెలుగావిడ వంటచేసి పెట్టింది.  ఆ వంట తిన్న పూరి గోవా షూట్ ను అద్భుతంగా షూట్ చేశారు.  ఇపుడు తన కొడుకు సినిమా కోసం కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.  తెలుగావిడతో వంట చేయించుకొని తింటున్నాడట పూరి.  మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.