పూరి ప్లాన్ మాములుగా లేదు... కొడితే బాలీవుడ్ అబ్బా అనాల్సిందే... 

పూరి ప్లాన్ మాములుగా లేదు... కొడితే బాలీవుడ్ అబ్బా అనాల్సిందే... 

పూరి జగన్నాథ్ సినిమాలు మాస్ కు చాలా దగ్గరగా ఉంటాయి.  పూరి సినిమా హిట్ అయ్యింది అంటే... ఆ సినిమాకు తిరుగుండదు.  మామూలు బ్లాక్ బస్టర్ హిట్ కాదు. ఒక రేంజ్ లో హిట్ అవుతుంది.  అందుకు ఓ ఉదాహరణ ఇస్మార్ట్ శంకర్.  సింపుల్ గా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో హిట్ సాధించింది.  

ఈ సినిమా తరువాత పూరి... విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.  జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఈ మూవీని తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దెందుకు ప్రయత్నం చేస్తున్నారు.  విజయ్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నది.  ఒక్క సినిమా కూడా బాలీవుడ్ లో చేయలేదు.  అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో హిట్ కావడంతో ఆ సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు.  అప్పటి నుంచి విజయ్ కు అక్కడ కూడా క్రేజ్ పెరిగింది.  ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇందులో కియారా లేదా అనన్య ఇద్దరిలో ఒకరు నటించే అవకాశం ఉంది.