మళ్ళీ లైన్లోకి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్... హీరో ఎవరంటే...!!

మళ్ళీ లైన్లోకి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్... హీరో ఎవరంటే...!!

ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది.  అలానే దర్శకుడు పూరి జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ఉన్నది.  అదే జనగణమన.  దేశభక్తితో కూడిన కథ ఇది.  ఈ కథతో సినిమా చేయాలని పూరి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.  అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్నది.  

పోకిరి, బిజినెస్ మెన్ సినిమాల తరువాత మహేష్ బాబుతో జనగణమన చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.  పూరికి సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పడింది.  అయితే, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత జనగణమన ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు.  అటు పూరి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తానని చెప్పడంతో దీనిపై ఆసక్తి కలిగింది.  అయితే, ఈ జనగణమన సినిమాలో హీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది.  మహేష్ బాబుతోనే సినిమా చేస్తాడా లేదంటే మరో హీరోతో సినిమా తెరకెక్కిస్తాడా చూడాలి.